120Log inSign up
by Bhagya sreeఎదురుచూపులు
Details


పచ్చదనాల చీర కట్టి

నీ నులి వెచ్చని

వెన్నెల ఊహల

ఊయలలో ఊగుతున్నా


నా కలలన్నీ మూటగట్టి

నా చూపుల మెరుపుల

వలపు గాలిలో 

కబురంపా


అందుకొని ఎదురొస్తావో

అందనని మురిపిస్తావో

నీకేం మహారాణి

నాకెన్ని రాచకార్యాలని

కవ్విస్తావో


ఏమొ, ఏలనో

తప్పక నువ్వొస్తావని

తెలిసినా

నా ఎదలయ

ఎదురుచూడడం మానదు

ఎందుకనో?

                                      


                    


Loading comments…