మల్లెలు కురిసి మనసులు కలిసి మంచులా ఒరిగిలే
వెన్నెల మురిసి వెన్నలా కరిగి ఎదలు రెండు కలిపిలే
భావాలే అక్షరాలై ఆశ్రయించినే పెదవులనే ఉచ్చరించను
ఆవేశాలే అలజడిరేపి ఉద్భవించే కనులతో
హెచ్చరించను
పరువాలు పల్లవించె ప్రాయంలో ముచ్చట్లై
మురిపించను
సరసాలు సరాగాలై సల్లాపములుగా గుచ్చే
వివరించను
మల్లెలు మురిసి మల్లెలు మురిసి విరిసెనే
అల్లిన ఆశలూ అలలు అలలుగా కురిసెనే
మల్లెలు మురిసి మల్లెలు మురిసి విరిసెనే
అల్లిన ఆశలూ అలలు అలలుగా కురిసెనే
మల్లెలు కురిసి మనసులు కలిసి మంచులా ఒరిగిలే
వెన్నెల మురిసి వెన్నలా కరిగి ఎదలు రెండు కలిపిలే
వచ్చిన వసంతం వలపంతా వాకిటను చేర్చగా
నచ్చిన మనసంతా నవనీతమై రాగం కూర్చగా
ఎన్ని ఎన్ని హొయలో ఎడదంతను ఏమార్చగా
కొన్ని కొన్ని మాయలే కొత్త మర్మమును నేర్చగా
మల్లెలు కురిసి మనసులూ కలిసి మంచులా ఒరిగిలే
వెన్నెల మురిసి వెన్నలా కరిగి ఎదలు రెండూ కలిపిలే
వెన్నెలవేళ పున్నమి కలిసి పూలపరువమాయే
అన్యులులేని ఏకాంతమే అదనులోవరమాయే
కదిలే హాయిని కథలా ఈ రేయిని నడిపించవా
మదిలో మారని గుర్తునే పచ్చలా పొడిపించవా
మల్లెలు కురిసి మనసులూ కలిసి మంచులా ఒరిగిలే
వెన్నెల మురిసి వెన్నలా కరిగి ఎదలు రెండూ కలిపిలే
Comments
Loading comments…