120Log inSign up
by Midhun babuపసిపిల్లలు..
Details

పసి పసి పిల్లలం...........

చెదరని నవ్వులం..........

వెలుగుల దివ్వెలం..........

కోరేదే తాయిలం............

ప్రేమకి మేము గులాములం..........

అమ్మా నాన్నల కన్నులం............

అల్లరి మల్లెలం............

తుంటరి పిడుగులం............

రేపటి పౌరులం.............

సాగదు ఏ జులుం..............

మేమే భావికి దివిటీలం.............

చదువుల వెన్నెల చకోరాలం.............

ఆటపాటల్లో మునిగే వాళ్ళం.............

ఇంట్లో పండగల్లె మసలే వాళ్ళం.............

ముద్దులు మూటకట్టి తిరిగే వాళ్ళం.............

చాచా నెహ్రుకే నచ్చిన వాళ్ళం.............

మీ ఆప్యాయతకి మురిసే వాళ్ళం...........

మీ చిన్నారులం చిట్టి పొట్టి బుజ్జాయిలం..........

Loading comments…