120Log inSign up
by Surekha Devallaసీత
Details

తనకోసం శివధనుస్సును ఎక్కుపెట్టిన నీలిమేఘశ్యాముని

తనమదిలోని అందాల రాకుమారుని రూపంలో ఎదురుగ నిలుచున్న అందాల రాముని రూపాన్ని కాంచి

ముగ్ధమోహన రూపవతి అయిన సీత 

మనసులోని సంతోషపు అలజడిని దాచుకుంటూ

ప్రేమనిండిన నయనాలతో 

ఆ మనోహరుని మెడలో 

వరమాల వేయబోతూ నిండైన 

ఆ మోహనరూపాన్ని చూచి తన అదృష్టానికి తానే అచ్చెరువొంది 

ఎదలోని అనురాగఝరిని చూపులలో కురిపిస్తూ

మరొక్కసారి తనివితీరా ఆ అనంతాభిరాముని కాంచెను సీత


Loading comments…