120Log inSign up
by Varanasi Ramabrahmamతటిల్లత
Details

అక్షయతృతీయ నాడు పసిడియై

అందినది చెలి ప్రణయము;


శృంగార శ్రీ పూర్తిగా కల

సఖి రాధయే, ప్రణయగాథయే


బంగారం మయం తన హృదయ సౌందర్యం

సింగారపు ప్రోవు, శిరీష కుసుమము తన మేను;


యవ్వనము పూర్తిగా నిండి విందులు చేయుచున్నది రసజ్ఞులకు;

ఈ అందాల రాసి ఊర్వసియో, అంద చందముల మెరయు లావణ్య సీమయో


అమృత "బిందు"వు తను

ఆకసమునుంచి దిగిన తటిల్లత

Loading comments…