గమ్యం గమ్యం ఎప్పుడూ దూరంలో కనిపించే ఒక గీత కాదు…
మన అడుగులు అలసిపోయినా ఆగిపోకుండా ఉండటానికి మనసు ఇచ్చుకునే ఒక మాట.
దారిలో ముళ్లు ఉన్నాయని ఆఁ దారి తప్పు కాదు…
కొన్నిసార్లు రక్తమోడిన పాదాలే మనల్ని సరైన చోటుకు తీసుకెళ్తాయి.
అందరూ తోడుగా నడిచే దారి మన గమ్యం కాకపోవచ్చు…
ఒంటరిగా నడవాల్సి వచ్చినప్పుడు మన అడుగుల శబ్దమే మనకు తోడుగా మారుతుంది.
కొన్ని తలుపులు మూసుకుపోతాయి… అవి మన కోసం కావు కాబట్టి అనేం కాదు, మన కోసం తెరుచుకునే తలుపు వైపు మన చూపు మళ్లించడానికి కాబోలు.
కొన్ని కలలు నెరవేరవు… అవి చిన్నవని కాదు, మన ప్రయాణానికి వేరే అర్థం ఉందని జీవితం చెప్పే విధానం అది.
ఓటమి వచ్చిన ప్రతిసారీ జీవితం మనల్ని కిందకు లాగదు…
మళ్లీ లేచే శక్తి మనలో ఎంతుందో చూపిస్తుంది. ఎందుకంటే… గమ్యాన్ని చేరిన రోజు మన ప్రయాణం గెలిచిందని కాదు…
గమ్యం కనిపించని రోజుల్లో కూడా మన అడుగులు ఆగలేదంటేనే మనిషి నిజంగా గెలిచినట్టు.
ఒకరోజు వెనక్కి తిరిగి చూస్తే ఎంత దూరం వచ్చామో కాదు…
ఎన్ని సార్లు విరిగిపోయి మళ్లీ మనల్ని మనమే నిర్మించుకున్నామో కనిపిస్తుంది.
అప్పుడు అర్థమవుతుంది— గమ్యం అనేది చేరుకోవాల్సిన చోటు కాదు…
చేరుకునేలోపు మనలో పుట్టిన కొత్త మనిషి అని...
అందుకే నడువు… ఎవరూ చప్పట్లు కొట్టకపోయినా నడువు.
ఎవరూ నమ్మకపోయినా నడువు.
దారి కనిపించకపోయినా నడువు.
ఎందుకంటే దారిని వెతుకుతూ వేసిన ప్రతి అడుగూ ఒకరోజు గమ్యానికి దారిగా మారుతుంది.
మరి చివరికి… గమ్యం చేరినప్పుడు ప్రపంచం నిన్ను చూసి “నువ్వు గెలిచావు” అంటుంది.
కానీ నీ మనసు మాత్రం నిశ్శబ్దంగా నవ్వుతూ చెబుతుంది— “నేను గెలిచింది గమ్యాన్ని కాదు… గమ్యం చేరలేనేమోనని భయపడిన ఆ నాలోని మనిషిని" అని...
Loading comments…